We Believe JesusFé, Esperança e Nova Vida

హోషే 2

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← హోషే 1 హోషే హోషే 3 →

1మీ సోదరులతో “మీరు నా ప్రజలు” అని చెప్పండి.

2మీ అమ్మపై న్యాయవిచారణ మొదలుపెట్టు.

3లేకపోతే ఆమెను నగ్న శరీరిగా చేస్తాను.

4ఆమె పిల్లల మీద జాలి చూపను. ఎందుకంటే దాని పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టినవారు.

5వారి తల్లి కులట.

6కాబట్టి దాని దారికి అడ్డంగా ముళ్ళ కంచె వేస్తాను.

7అది తన విటులను వెంటాడినా వారిని కలుసుకోలేక పోతుంది.

8దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను, ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు.

9కాబట్టి నా ధాన్యాన్ని నా ద్రాక్షారసాన్ని వాటి కోత కాలాల్లో ఆమె దగ్గర నుండి తీసేసుకుంటాను.

10దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను.

11ఆమె ఉత్సవాలన్నీ ఆపిస్తాను.

12“ఇవి నా విటులు నాకిచ్చిన జీతం” అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను.

13అది బయలు దేవుళ్ళ పండగలు ఆచరించినందుకు నేను దాన్ని శిక్షిస్తాను.

14ఆ తరవాత ఆమెను మళ్లీ నావైపు తిప్పుకుంటాను. ఆమెను అరణ్యంలోకి తీసుకుపోతాను.

15ఆమెకు ద్రాక్షతోటలు రాసిస్తాను.

16“ఆ రోజుల్లో” యెహోవా అంటున్నాడు. “నీవు ‘నా బయలు’ అని నన్ను సంబోధించవు.

17ఇక మీదట బయలు దేవుళ్ళ పేర్లు నీ నోటినుండి తుడిచి వేస్తాను. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావు.

18“ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో,

19నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.

20యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను.

21ఆ దినాన నేను జవాబిస్తాను.”

22భూధాన్య ద్రాక్షారస తైలాల మనవి ఆలకింపగా,

23నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను.

← హోషే 1 హోషే హోషే 3 →