1ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజులు, యెహోయాషు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలించిన దినాల్లో బెయేరి కుమారుడు హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
2యెహోవా హోషేయతో మొదట మాట్లాడినప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు.
3కాబట్టి హోషేయ వెళ్ళి దిబ్లయీము కూతురు గోమెరును పెళ్ళాడాడు.
4యెహోవా అతనికి ఇలా ఆజ్ఞాపించాడు.
5ఆ రోజుల్లో జరిగేది ఏమిటంటే,
6గోమెరు మళ్లీ గర్భం ధరించి ఆడపిల్లను కన్నది.
7అయితే యూదావారిపై జాలి చూపుతాను.
8లో రూహామా పాలు మానిన తరువాత ఆమె తల్లి గర్భం ధరించి మరొక కొడుకును కన్నది.
9యెహోవా ఇలా చెప్పాడు.
10అయినప్పటికీ ఇశ్రాయేలీయుల జనసంఖ్య సముద్రతీరంలో ఇసుకంత విస్తారం అవుతుంది.
11యూదా, ఇశ్రాయేలు ఒక్క చోట సమకూడుతారు.