We Believe JesusFé, Esperança e Nova Vida

హబ 1

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

హబ హబ 2 →

1ప్రవక్త అయిన హబక్కూకు దగ్గరికి దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.

2“యెహోవా, నేను సహాయం కోసం మొర్రపెట్టినా నీవెన్నాళ్లు ఆలకించకుండా ఉంటావు?

3నన్నెందుకు దోషాన్ని చూడనిస్తున్నావు?

4అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమై పోయింది.

5అన్యజనుల్లో జరుగుతున్నది చూడండి, ఆలోచించండి. నిర్ఘాంతపొండి.

6కల్దీయులను1:6 కల్దీయులను బబులోనీయులు నేను రేపుతున్నాను. వినండి. వారు తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించాలని భూదిగంతాలదాకా సంచరించే ఉద్రేకం గల క్రూరులు.

7వారు ఘోరమైన భీకర జాతి.

8వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తుతాయి.

9వెనుదిరిగి చూడకుండా దౌర్జన్యం చేయడానికి వారు వస్తారు.

10రాజులను అపహాస్యం చేస్తారు.

11తమ బలమే తమ దేవుడనుకుంటారు.

12యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నువ్వున్న వాడవు కావా?

13నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది గదా.

14పాలించే వారెవరూ లేని చేపలతో, పాకే పురుగులతో నువ్వు మనుషులను సమానులనుగా చేశావు.

15వాడు గాలం వేసి మనుషులందరిని గుచ్చి లాగుతున్నాడు.

16కాబట్టి వలల వలన మంచి రాబడి, పుష్టినిచ్చే భోజనం తనకు దొరుకుతున్నాయని వాడు తన వలకు బలులు అర్పిస్తున్నాడు.

17వాడు అస్తమానం తన వలలో నుండి దిమ్మరిస్తూ ఉండాలా? ఎప్పటికీ మానకుండా వాడు జాతులను దయలేకుండా హతం చేస్తూ ఉండాలా?”

హబ హబ 2 →