We Believe JesusFé, Esperança e Nova Vida

యెషయా 22

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← యెషయా 21 యెషయా యెషయా 23 →

1“దర్శనం లోయ22:1 దర్శనం లోయ యెరూషలేము నగరం” ను గూర్చిన దైవ ప్రకటన.

2సందడితో నిండి పోయి కేకలు వేస్తున్న పట్టణమా! వేడుకల్లో మునిగిపోయిన నగరమా!

3నీ అధిపతులంతా కలసి పారిపోయారు. కానీ విలుకాళ్ళు బాణాలు వేసి కొట్టకుండానే వాళ్ళు దొరికి పోయారు.

4కాబట్టి నేను చెప్పేదేమిటంటే ‘నా వంక చూడకండి. నేను తీవ్రమైన విషాదంతో ఏడుస్తాను.

5దర్శనం లోయలో అల్లరి, తొక్కిసలాటతో నిండిన ఒక రోజు రాబోతుంది. దాన్ని సేనల ప్రభువు అయిన యెహోవా రప్పించబోతున్నాడు.

6ఏలాము రథాలతో ఉన్న యోధులతో, రౌతులతో తన అంబుల పొదిని ధరించింది.

7నీకు ఇష్టమైన లోయలన్నీ రథాలతో నిండిపోతాయి.

8అప్పుడు ఆయన యూదా భద్రత కవచాన్ని తీసివేశాడు.

9దావీదు పట్టణానికి అనేక చోట్ల బీటలు పడటం నువ్వు చూశావు. అది తెలుసుకుని నువ్వు దిగువన ఉన్న కోనేరు నుండి నీళ్ళ తెచ్చుకున్నావు.

10మీరు యెరూషలేములోని ఇళ్ళను లెక్కపెట్టారు. ప్రాకారాన్ని బలపరచడానికై మీరు ఇళ్ళు పడగొట్టారు.

11పాత కోనేటి నీళ్ళ కోసం రెండు గోడల మధ్య మీరు ఒక జలాశయాన్ని నిర్మించారు.

12ఆ రోజున ఏడవడానికీ, అంగలార్చడానికీ, తలలు బోడి చేసుకోడానికీ,

13కానీ చూడండి! దానికి బదులుగా, పశువులను చంపుదాం, గొర్రెలను వధించుదాం.

14ఈ సంగతి సేనల ప్రభువైన యెహోవా నా చెవుల్లో తెలియజేశాడు.

15సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా చెప్పాడు. భవనంలో నిర్వహణా పనులు చూసే షెబ్నా దగ్గరకి వెళ్ళు. అతనికి ఇలా చెప్పు.

16“ఇక్కడ నీకేం పని? ఇక్కడ సమాధి తొలిపించుకోడానికి అసలు నువ్వెవరు?

17చూడు, బలవంతుడివైన నిన్ను యెహోవా విసిరి వేయబోతున్నాడు. ఆయన నిన్ను నేలకు విసిరి కొట్టబోతున్నాడు. ఆయన నిన్ను గట్టిగా పట్టుకుంటాడు.

18ఆయన నిన్ను కచ్చితంగా చుట్ట చుట్టివేస్తాడు. ఒక బంతిలా నిన్ను విశాలమైన దేశంలోకి విసిరివేస్తాడు.

19నీ ఉద్యోగం నుండి నిన్ను తొలగిస్తాను. నీ హోదాను తీసి వేస్తాను. నిన్ను కిందకు లాగేస్తాను.

20ఆ రోజున నేను నా సేవకుడూ, హిల్కీయా కొడుకూ అయిన ఎల్యాకీముని పిలుస్తాను.

21నీ చొక్కా అతనికి తొడిగిస్తాను. నీ నడికట్టును అతనికి కడతాను. నీ అధికారాన్ని అతనికి బదలాయిస్తాను.

22నేను దావీదు ఇంటి తాళపు చెవిని, అధికారాన్ని అతని భుజంపై ఉంచుతాను.

23బలమైన చోట ఒక మేకును దిగగొట్టినట్టు నేను అతణ్ణి స్థిరపరుస్తాను.

24చిన్న గిన్నెలనూ, పాత్రలనూ మేకుకి వేలాడదీసినట్టుగా

25ఇది సేనల ప్రభువైన యెహోవా మాట. “ఆ రోజున బలమైన చోట కొట్టిన మేకు సడలి ఊడిపోతుంది. కింద పడిపోతుంది. దానిపై ఆధారపడిన బరువంతా తెగి కింద పడుతుంది.” ఇది యెహోవా మాట.

← యెషయా 21 యెషయా యెషయా 23 →