1సముద్రతీరాన ఉన్న ఎడారిని గురించిన దైవ ప్రకటన.
2దుస్థితిని తెలియ జేసే ఒక దర్శనం నాకు కలిగింది.
3కాబట్టి నా నడుముకు విపరీతమైన నొప్పి కలిగింది. ప్రసవ వేదన పడే స్త్రీకి కలిగిన నొప్పుల్లాంటివే నాకూ కలిగాయి.
4నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. భయంతో నాకు జలదరింపు కలిగింది.
5వాళ్ళు భోజనం బల్ల సిద్ధం చేస్తారు. తివాచీలు పరుస్తారు. అన్నం తిని, తాగుతారు.
6ఎందుకంటే ప్రభువు నాకు చెప్పిన మాట ఇది.
7అతడు ఒక రథాన్ని చూసినప్పుడు, జంట రౌతులు గుర్రాలపై రావడం చూసినప్పుడు,
8ఆ కాపలా వాడు ఇలా అరుస్తాడు. “నా ప్రభూ, ఈ పహారా స్తంభంపై ప్రతి రోజూ, రోజంతా నిలబడి ఉన్నాను. రాత్రంతా నేను కాపలా కాస్తూనే ఉన్నాను.”
9చూడండి, రథాన్ని తోలుకుంటూ ఒక వ్యక్తి గుర్రాలెక్కి వస్తున్న రౌతులతో వస్తున్నాడు. వాళ్ళు జంటలుగా ఒక దళంగా వస్తున్నారు. అతడు పిలిచి ఇలా చెప్పాడు. “బబులోను కూలి పోయింది. నిజంగానే కూలిపోయింది. దాని చెక్కిన దేవుళ్ళ బొమ్మలన్నీ విరిగి నేలకూలాయి.”
10నేను నూర్చిన నా ధాన్యమా, నేను చెరిగిన వాళ్ళు, నా కళ్ళంలో నూర్చిన పిల్లలు, ఇశ్రాయేలు దేవుడు, సేనలకు అధిపతి అయిన యెహోవా దగ్గర నేను విన్నది నీకు తెలియజేశాను.
11దూమా21:11 దూమా ఎదోముకు మరో పేరు, దూమా అర్ధం నిశబ్దం గూర్చిన ఒక దైవ ప్రకటన. శేయీరు21:11 శేయీరు ఎదోములో నుండి ఒకడు నన్ను అడుగుతున్నాడు. “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది?”
12అప్పుడు కావలివాడు “ఉదయం వస్తుంది, రాత్రి కూడా వస్తుంది. మీరు అడగాలనుకుంటే అడగండి. మళ్ళీ తిరిగి రండి” అంటున్నాడు.
13అరేబియాను గూర్చిన ఒక దైవ ప్రకటన. దెదాను సంచార వర్తకులు, మీరు అరేబియా ఎడారిలో రాత్రి గడపాలి.
14తేమా దేశ వాసులారా, దాహంతో ఉన్న వారి కోసం నీళ్ళు తీసుకుని రండి. దేశ దిమ్మరుల ఎదురుగా ఆహారం తీసుకు రండి.
15ఎందుకంటే వాళ్ళు కత్తినుండి తప్పించుకుని పారిపోతున్నారు. దూసిన కత్తి నుండీ, ఎక్కు పెట్టిన విల్లు నుండీ, యుద్ధ భయం వల్లా పారిపోతున్నారు.
16ఎందుకంటే ప్రభువు నాకిలా చెప్పాడు. “మరో సంవత్సరంలోగా కూలి వాళ్ళని ఒక సంవత్సరానికి పెట్టుకున్నట్టుగా కేదారు ప్రభావం అంతా నశించిపోతుంది.
17కేదారు ప్రజల్లో కొద్దిమంది విలుకాళ్ళూ, శూరులూ మిగిలిపోతారు.” ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఇది.