We Believe JesusFé, Esperança e Nova Vida

యెహె 19

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← యెహె 18 యెహె యెహె 20 →

1“కాబట్టి నువ్వు, ఇశ్రాయేలీయుల నాయకుల విషయంలో శోకించి, ఇలా ప్రకటించు.

2నీ తల్లి ఎవరు? సింహాల్లో ఒక ఆడసింహం లాంటిది.

3వాటిలో ఒక దాన్ని కొదమసింహం అయ్యేంతగా పెంచింది. ఆ కొదమసింహం వేటాడడం నేర్చుకుంది.

4అప్పుడు ఇతర ప్రజలు అతని సంగతి విన్నారు. వాళ్ళ ఉచ్చులో అతడు చిక్కాడు.

5దాని తల్లి దాని కోసం కనిపెట్టి, తన ఆశ భంగం అయిందని తెలుసుకుని, తన పిల్లల్లో ఇంకొకదాన్ని పెంచి, కొదమసింహంగా చేసింది.

6ఇది కూడా కొదమ సింహమై, తక్కిన కొదమ సింహాలతో పాటు తిరిగి, చీల్చి చెండాడి వేటాడడం నేర్చుకుని, మనుషులును మింగేసింది.

7తరువాత అతడు వాళ్ళ వితంతువులను మానభంగం చేసి వాళ్ళ పట్టణాలు పాడు చేశాడు.

8నాలుగు దిక్కుల దేశపు ప్రజలందరూ దాన్ని పట్టుకోడానికి పొంచి ఉండి, వల పన్నినప్పుడు, అది వాళ్ళ ఉచ్చులో చిక్కింది.

9అప్పుడు వాళ్ళు దానికి గాలాలు తగిలించి, బోనులో పెట్టి, బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు.

10నీ తల్లి ఫలవంతమైన తీగెలతో నిండి, ఒక నీటి ప్రవాహపు కాలవ దగ్గర నాటిన ద్రాక్షావల్లిలా ఉండేది.

11రాజులకు రాజదండాలు చెయ్యడానికి వీలైన బలమైన కొమ్మలు ఉండి, అవి మిగతా వాటికంటే ఎంతో ఎత్తుగా ఎదిగాయి.

12కాని, అతికోపంతో ఆ ద్రాక్షవల్లిని పెకలించి నేల మీద పడేయడం జరిగింది.

13కాబట్టి ఇప్పుడు అది కరువు, దాహం ఉన్న ప్రదేశంలో ఎడారిలో నాటి ఉంది.

14దాని పండ్లు కాల్చేసింది. గట్టి కొమ్మ ఒక్కటి కూడా లేదు.

← యెహె 18 యెహె యెహె 20 →