1ఇశ్రాయేలీయులను గురించి తెకోవలోని గొర్రెల కాపరి ఆమోసు చూసిన దర్శనంలోని విషయాలివి. యూదారాజు ఉజ్జియా రోజుల్లో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కొడుకు యరొబాము రోజుల్లో భూకంపం రావడానికి రెండేళ్ళు ముందు, అతడు ఈ దర్శనం చూశాడు.
2అతడు ఇలా చెప్పాడు,
3యెహోవా చెప్పేదేమిటంటే,
4నేను హజాయేలు ఇంటి మీదకి అగ్ని పంపిస్తాను. అది బెన్హదదు రాజ భవనాలను దహించి వేస్తుంది.
5దమస్కు ద్వారాల అడ్డగడియలను విరగగొడతాను.
6యెహోవా చెప్పేదేమిటంటే,
7గాజా ప్రాకారాల మీద నేను అగ్ని పంపిస్తాను.
8అష్డోదులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను.
9యెహోవా చెప్పేదేమిటంటే,
10నేను తూరు ప్రాకారాల మీదికి అగ్ని పంపిస్తాను.
11యెహోవా చెప్పేదేమిటంటే,
12తేమాను మీదికి నేను అగ్ని పంపిస్తాను. అది బొస్రా రాజ భవనాలను తగలబెడుతుంది.”
13యెహోవా చెప్పేదేమిటంటే,
14రబ్బా ప్రాకారాలను కాల్చేస్తాను.
15వారి రాజు, అతని అధిపతులందరూ బందీలుగా దేశాంతరం పోతారు” అని యెహోవా చెబుతున్నాడు.