1ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన పట్టణం1:1 పట్టణం యెరూషలేము పట్టణం, ఇప్పుడు వెలవెలబోయింది.
2రాత్రివేళ ఎంతో శోకిస్తూ ఉంది.
3యూదా పేదరికం, బాధ అనుభవించి, దాస్యంలోకీ, చెరలోకీ వెళ్ళింది.
4నియమించిన పండగలకు ఎవరూ రాలేదు గనక సీయోను దారులు సంతాపంతో ఉన్నాయి.
5దాని విరోధులు అధికారులయ్యారు. దాని శత్రువులు వర్ధిల్లుతున్నారు.
6సీయోను కుమారి అందమంతా పోయింది.
7దానికి బాధ కలిగిన కాలంలోనూ, ఆశ్రయం లేని కాలం లోనూ, పూర్వం తనకు కలిగిన శ్రేయస్సు అంతా యెరూషలేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంది.
8యెరూషలేము ఘోరమైన పాపం చేసింది.
9దాని చెంగులకు మురికి అంటింది.
10దాని శ్రేష్ఠమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి చిక్కాయి.
11దాని కాపురస్థులందరూ మూలుగుతూ ఆహారం కోసం వెదుకుతున్నారు.
12దారిలో నడిచిపోతున్న ప్రజలారా, ఇలా జరిగినందుకు మీకు ఏమీ అనిపించడం లేదా?
13పై నుంచి ఆయన నా ఎముకల్లోకి అగ్ని పంపించాడు.
14నా అతిక్రమం అనే కాడి నాకు ఆయనే కట్టాడు.
15నాకు అండగా నిలిచిన శూరులను ఆయన విసిరి పారేశాడు.
16వీటిని బట్టి నేను ఏడుస్తున్నాను.
17ఆదరించేవాడు లేక సీయోను చేతులు చాపింది.
18యెహోవా న్యాయవంతుడు. నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను.
19నా ప్రేమికులను నేను పిలిపించినప్పుడు వాళ్ళు నన్ను మోసం చేశారు.
20యెహోవా, నన్ను తేరి చూడు. నాకు అమితమైన బాధ కలిగింది. నా కడుపు తిప్పుతోంది.
21నా మూలుగు విను. నన్ను ఆదరించేవాడు ఒక్కడూ లేదు. నువ్వు నాకు కష్టం కలిగించావన్న వార్త నా శత్రువులు విని సంతోషంగా ఉన్నారు.
22వాళ్ళు చేసిన చెడుతనం అంతా నీ ఎదుటికి వస్తుంది గాక.