We Believe JesusFé, Esperança e Nova Vida

కీర్తన 125

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← కీర్తన 124 కీర్తన కీర్తన 126 →

1యెహోవా మీద నమ్మకం ఉంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా నిశ్చలంగా శాశ్వతంగా నిలిచి ఉంటారు.

2యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇప్పటినుండి యెహోవా తన ప్రజల చుట్టూ నిరంతరం ఉంటాడు.

3నీతిమంతులు పాపం చేయకుండా ఉండేలా నీతిమంతుల వారసత్వంపై దుష్టుల రాజదండం పెత్తనం చెయ్యదు.

4యెహోవా, మంచివారికి మంచి జరిగించు. యథార్థహృదయం గలవారికి శుభం కలిగించు.

5తమ కుటిల మార్గాలకు తొలగిపోయిన వాళ్ళ విషయానికొస్తే ఆయన పాపం చేసేవాళ్ళను పారదోలేటప్పుడు వారిని దుర్మార్గులతో సహా వెళ్ళగొడతాడు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానాలు ఉండు గాక.

← కీర్తన 124 కీర్తన కీర్తన 126 →