1పెతూయేలు కొడుకు యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు.
2పెద్దలారా, వినండి. దేశంలో నివసించే మీరంతా జాగ్రత్తగా వినండి.
3దాన్ని గురించి మీ పిల్లలకు చెప్పండి.
4ఎగిరే మిడతల గుంపులు విడిచి పెట్టిన దాన్ని పెద్ద మిడతలు తినేశాయి.
5తాగుబోతులారా, లేచి ఏడవండి.
6ఒక రాజ్యం నా దేశం మీదికి వచ్చింది.
7అతడు నా ద్రాక్షతోటను భయపెట్టేదిగా చేశాడు.
8తన పడుచు భర్తను కోల్పోయి గోనెసంచి కట్టుకున్న కన్యలా దుఖించు.
9నైవేద్యం, పానార్పణం యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచి పోయాయి.
10పొలాలు పాడయ్యాయి. భూమి దుఖిస్తోంది.
11గోదుమ, బార్లీ గురించి రైతులారా, సిగ్గుపడండి,
12ద్రాక్షతీగలు వాడిపోయాయి, అంజూరు చెట్లు ఎండిపోయాయి.
13యాజకులారా, గోనెపట్ట కట్టుకుని దుఖించండి!
14ఉపవాస దినం ప్రతిష్ఠించండి. సంఘంగా సమకూడండి.
15యెహోవా దినం దగ్గర పడింది.
16మన కళ్ళముందే ఆహారం,
17విత్తనాలు మట్టిగడ్డల కింద కుళ్ళిపోతున్నాయి,
18మేత లేక జంతువులు ఎంతగా మూలుగుతున్నాయి!
19యెహోవా, నీకే నేను మొరపెడుతున్నాను.
20కాలవలు ఎండిపోయాయి,