We Believe JesusFé, Esperança e Nova Vida

యిర్మీయా 49

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← యిర్మీయా 48 యిర్మీయా యిర్మీయా 50 →

1అమ్మోను ప్రజలను గూర్చి యెహోవా ఇలా చెప్తున్నాడు.

2అయితే యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. “రబ్బాకు వ్యతిరేకంగానూ, అమ్మోను ప్రజలకు వ్యతిరేకంగానూ నేను యుద్ధ భేరీని మోగించే రోజులు వస్తున్నాయి.

3హెష్బోనూ, రోదన చెయ్యి. ఎందుకంటే హాయి నాశనమై పోయింది. రబ్బా కుమార్తెలారా, ఏడవండి, గోనె పట్టలు కట్టుకోండి.

4విశ్వాసం లేని కూతురా, నీ బలాన్ని గూర్చి నీకు అంత ఆహంకారమెందుకు? నీ బలం నీళ్ళ లాగా ప్రవహించి పోతుంది.

5చూడు. నీ పైకి తీవ్రమైన భయం తీసుకు వస్తున్నాను.” సేనల ప్రభువు అయిన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.

6అయితే ఇదంతా అయ్యాక నేను అమ్మోను ప్రజల భాగ్యాన్ని పునరుద్ధరిస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

7ఏదోమును గూర్చి సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “తేమానులో జ్ఞానమనేదే లేదా?

8దేదాను నివాసులు పారిపోండి. వెనక్కి తిరగండి. నేలపై ఉన్న కలుగుల్లో ఉండండి.

9ద్రాక్షపళ్ళు ఏరుకునే వాళ్ళు నీ దగ్గరికి వస్తే, కొన్ని పళ్ళు వాళ్ళు వదిలేయరా?

10కానీ నేను ఏశావును నగ్నంగా నిలబెడుతున్నాను. అతని రహస్య స్థలాలను బహిర్గతం చేస్తున్నాను. అతడు ఇక ఎక్కడా దాక్కోలేడు.

11అనాథలైన పిల్లలను విడిచిపెట్టు. వాళ్ళను నేను చూసుకుంటాను. నీ వితంతువులు నన్ను నమ్ముకోవచ్చు.”

12యెహోవా ఇలా చెప్తున్నాడు. “పాత్రలోని దాన్ని తాగాల్సిన అవసరం లేని వాళ్ళు కూడా కచ్చితంగా పాత్రలోది కొంత తాగుతున్నారు. అలాంటప్పుడు నువ్వు శిక్షను ఎలా తప్పించుకుంటావు. తప్పించుకోలేవు. ఆ పాత్రలోది తప్పకుండా తాగాల్సిందే.

13బొస్రా భయాన్ని కలిగించే స్థలంగానూ, అవమానంగానూ, ఒక శాపవచనంగానూ ఉంటుంది. దాని పట్టణాలన్నీ ఎప్పటికీ నాశనమై ఉంటాయి. ఎందుకంటే నేను నా పేరు చెప్పి ప్రమాణం చేశాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

14యెహోవా దగ్గర నుండి నేనొక వార్త విన్నాను. ఆ వార్తతో జాతులన్నిటి దగ్గరికి ఒక వార్తాహరుడు వెళ్ళాడు.

15ఇతర జాతులతో పోలిస్తే నిన్ను అల్పుడుగా చేస్తాను. వాళ్ళ దృష్టిలో నిన్ను నీచుడిగా చేస్తాను.

16కొండ శిఖరాలపై నివసిస్తావు. పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్నావు,

17“ఏదోమును దాటి వెళ్ళే వాళ్ళకు అది భయం పుట్టిస్తుంది.

18యెహోవా ఇలా చెప్తున్నాడు. “నేను సొదోమ, గొమొర్రా వాటి చుట్టూ ఉన్న పట్టణాలను నాశనం చేసినట్టే వీటికీ చేసిన తరువాత,

19చూడండి, అతడు యొర్దాను అడవుల్లో నుండి ఎంతో కాలంగా ఉన్న పచ్చిక మైదానం లోకి వచ్చే సింహంలా వస్తున్నాడు.

20కాబట్టి ఏదోముకు వ్యతిరేకంగా యెహోవా నిర్ణయించిన ప్రణాళికలను వినండి.

21వాళ్ళు కూలినప్పుడు భూమి కంపించింది. దాని దుర్గతికి అది వేసే కేకలు ఎర్ర సముద్రం వరకూ వినిపించాయి.

22చూడండి డేగలా శత్రువు దాడి చేస్తాడు. అది దూసుకు వచ్చి బొస్రాను తన రెక్కలతో కప్పివేస్తుంది.

23దమస్కు గూర్చిన వాక్యం. “హమాతు, అర్పాదూ జరిగిన వినాశనం వార్త విని సిగ్గుపడతాయి.

24దమస్కు ఎంతో బలహీనంగా ఉంది. పారిపోడానికి అది వెనక్కు తిరిగింది. దాన్ని భయం పట్టుకుంది.

25దానిలో నివసించే ప్రజలు ఇలా అనుకుంటారు. “ఇంత ప్రసిద్ధి చెందిన పట్టణం, నాకెంతో ఆనందాన్ని ఇచ్చే పట్టణం ఇది. ప్రజలు దీనిని ఇంకా ఖాళీ చేయలేదేమిటి?”

26కాబట్టి పట్టణంలో యువకులు దాని వీధుల్లోనే కూలిపోతారు.

27“నేను దమస్కు ప్రాకారం పై అగ్ని రాజేస్తాను. అది బెన్హదదు బలమైన దుర్గాలను తగలబెట్టేస్తుంది.”

28కేదారు, హాసోరు రాజ్యాలను గూర్చి యెహోవా బబులోనురాజు నెబుకద్నెజరుకు ఇలా చెప్పాడు. ఈ రాజ్యాలపై దాడి చేయడానికి నెబుకద్నెజరు వెళ్తున్నాడు.

29అతని సైన్యం వాళ్ళ గుడారాలనూ, వాళ్ళ మందలనూ, గుడారాల తాళ్లనూ మిగిలిన సామాగ్రినంతా తీసుకు వెళ్తారు.

30హాసోరు నివాసులారా, పారిపోండి. దూరంగా వెళ్ళండి. భూమి పైన ఉన్న కలుగుల్లో ఉండండి.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

31మీరు లేవండి! నిశ్చింతగానూ క్షేమంగానూ నివసిస్తున్న రాజ్యంపై దాడి చేయండి.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

32వాళ్ళ ఒంటెలు దోపుడు సొమ్ము అవుతాయి. విస్తారమైన వాళ్ళ సంపద మీకు యుద్ధంలో కొల్లగొట్టే సొమ్ముగా ఉంటుంది.

33“హాసోరు పాడై నక్కలకు నివాస స్థలంగా ఉంటుంది. శాశ్వతంగా వ్యర్ధభూమిగా ఉంటుంది.

34యూదా రాజు సిద్కియా పరిపాలన ప్రారంభంలో యెహోవా వాక్కు యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఆయన ఏలాము గూర్చి ఇలా చెప్పాడు.

35“సేనల ప్రభువు యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి, నేను ఏలాముకు ముఖ్య బలమైన వాళ్ళ విల్లునూ, దాన్ని సంధించే వాళ్ళనూ విరగగొడతాను.

36ఎలాగంటే ఆకాశంలోని నాలుగు దిక్కుల నుండి నాలుగు వాయువులను రప్పిస్తాను.

37వాళ్ళ శత్రువుల ఎదుటా, వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసే వారి ఎదుటా వాళ్ళను చెదరగొడతాను.

38“ఏలాములో నా సింహాసనాన్ని నిలబెడతాను. అక్కడి రాజునూ, అధిపతులనూ నాశనం చేస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

39“అయితే తర్వాత రోజుల్లో ఏలాము భాగ్యాన్ని పునరుద్ధరిస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

← యిర్మీయా 48 యిర్మీయా యిర్మీయా 50 →