1సీయోను నీతి, సూర్యకాంతిలా కనబడే వరకూ దాని రక్షణ, దీపాలుగా వెలిగే వరకూ
2రాజ్యాలు నీ నీతి చూస్తారు. రాజులంతా నీ మహిమను చూస్తారు.
3నువ్వు యెహోవా చేతిలో అందమైన కిరీటంగా నీ దేవుని చేతిలో రాజ్యకిరీటంగా ఉంటావు.
4నిన్ను ఇంకెప్పుడూ “విడువబడిన దానివి” అనీ, నీ దేశాన్ని “పాడైపోయినది” అనీ ఇక అనరు.
5యువకుడు ఒక యువతిని పెళ్లిచేసుకున్నట్టు నీ కొడుకులు62:5 నీ కొడుకులు నీ సృష్టికర్త నిన్ను పెళ్లి చేసుకుంటారు.
6యెరూషలేమా, నీ గోడలమీద నేను కావలి వారిని ఉంచాను.
7ఆయన యెరూషలేమును సుస్థిరం చేసే వరకు
8తన కుడి చెయ్యి తోడనీ తన బలమైన హస్తం తోడనీ యెహోవా ఇలా ప్రమాణం చేశాడు,
9కోత కోసినవాళ్ళే దాన్ని తింటారు. యెహోవాను స్తుతిస్తారు.
10ద్వారాల గుండా రండి! రండి! ప్రజలకు దారి సిద్ధం చేయండి!
11వినండి. ప్రపంచమంతటికీ యెహోవా తెలియచేశాడు.
12“పరిశుద్ధప్రజలు” “యెహోవా విమోచించిన వారు” అని వీళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. “కోరతగినది” అనీ “తిరస్కారానికి గురి కాని పట్టణం” అనీ నిన్ను పిలుస్తారు.