We Believe JesusFé, Esperança e Nova Vida

యెషయా 51

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← యెషయా 50 యెషయా యెషయా 52 →

1నీతిని అనుసరిస్తూ యెహోవాను వెతుకుతూ ఉండే మీరు, నా మాట వినండి.

2మీ తండ్రి అబ్రాహామును, మిమ్మల్ని కనిన శారాను గమనించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు

3యెహోవా సీయోనును ఆదరిస్తాడు. పాడైన దాని స్థలాలన్నిటినీ ఆయన ఆదరిస్తాడు.

4నా ప్రజలారా, నా మీద దృష్టి పెట్టండి. నా మాట వినండి!

5నా నీతి దగ్గరగా ఉంది. నా విడుదల బయలుదేరుతుంది. నా చెయ్యి రాజ్యాలను శిక్షిస్తుంది.

6ఆకాశం వైపు మీ కళ్ళు ఎత్తండి. కిందున్న భూమిని చూడండి.

7సరైనది అంటే ఏంటో తెలిసిన మీరు నా మాట వినండి. నా చట్టాన్ని మీ హృదయంలో ఉంచుకున్న మీరు, వినండి.

8చిమ్మెట బట్టలను కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. పురుగు, బొచ్చును కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది.

9యెహోవా హస్తమా లే! బలం ధరించుకో.

10చాలా లోతైన నీళ్లున్న సముద్రాన్ని ఇంకిపోయేలా చేసింది నువ్వే గదా?

11యెహోవా విమోచించినవారు సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వస్తారు.

12నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను.

13ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన మీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు మరచిపోతున్నారు?

14కుంగిపోయిన వారిని యెహోవా త్వరగా విడుదల చేస్తాడు. అతడు గోతిలోకి పోడు. చావడు. అతనికి తిండి లేకుండా పోదు.

15నేను యెహోవాను. నీ దేవుణ్ణి. సముద్రపు అలలు ఘోషించేలా దాన్ని రేపుతాను. నేను సేనల ప్రభువు యెహోవాను.

16నేను ఆకాశాలను పరచడానికీ భూమికి పునాదులు వేయడానికీ “నువ్వే నా ప్రజ” అని సీయోనుతో చెప్పడానికీ

17యెరూషలేమా! లే. లేచి నిలబడు.

18ఆమె కనిన కొడుకులందరిలో ఆమెకు దారి చూపేవాడు ఎవడూ లేడు.

19రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నీతో కలిసి ఎవరు ఏడుస్తారు?

20నీ కొడుకులు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుపడినట్టు, ప్రతి వీధిలో పడియున్నారు.

21అయితే ద్రాక్షమద్యం లేకుండానే మత్తుగా ఉండి బాధపడినదానా, ఈ మాట విను.

22నీ యెహోవా ప్రభువు తన ప్రజల పక్షాన వాదించే నీ దేవుడు ఇలా చెబుతున్నాడు,

23నిన్ను బాధించేవాళ్ళ చేతిలో దాన్ని పెడతాను. ‘మేము నీ మీద నడిచిపోతాం. సాష్టాంగ పడు’

← యెషయా 50 యెషయా యెషయా 52 →