We Believe JesusFé, Esperança e Nova Vida

యెషయా 47

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← యెషయా 46 యెషయా యెషయా 48 →

1బబులోను కన్యా, కిందికి దిగి మట్టిలో కూర్చో.

2తిరగలి తీసుకుని పిండి విసురు. నీ ముసుగు తీసివెయ్యి.

3నీ చీర కూడా తీసేస్తారు. నీ నగ్నత్వం బయటపడుతుంది.

4మా విమోచకునికి సేనల అధిపతి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయిన యెహోవా అని పేరు.

5కల్దీయుల కుమారీ, మౌనంగా చీకటిలోకి వెళ్ళిపో.

6నా ప్రజల మీద కోపంతో నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించాను.

7నీవు “నేను ఎల్లకాలం మహారాణిగా ఉంటాను” అనుకుని ఈ విషయాల గురించి ఆలోచించలేదు,

8కాబట్టి సుఖాసక్తితో నిర్భయంగా జీవిస్తూ “నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు.

9పుత్ర శోకం, వైధవ్యం, ఈ రెండూ ఒక్క నిమిషంలో ఒకే రోజున నీకు కలుగుతాయి.

10నీ దుర్మార్గంలో మునిగిపోయి “ఎవడూ నన్ను చూడడు” అని అనుకున్నావు.

11వినాశనం నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు మంత్రాలతో దాన్ని పోగొట్టలేవు.

12నీవు నిలబడి చిన్నతనం నుండి నువ్వు ఎంతో ప్రయాసతో నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను, విస్తారమైన నీ శకునాలను ప్రయోగించు.

13నీ విస్తారమైన చర్చల వలన నువ్వు అలసిపోయావు.

14వారు చెత్త పరకల్లాగా అవుతారు. అగ్ని వారిని కాల్చివేస్తుంది.

15నువ్వు ఎవరికోసం చాకిరీ చేసి అలసిపోయావో వారు నీకు ఎందుకూ పనికిరారు.

← యెషయా 46 యెషయా యెషయా 48 →