1చూడండి, సేనలకు అధిపతి, ప్రభువూ అయిన యెహోవా యెరూషలేము నుంచి, యూదా నుంచి దాని పోషణ, దాని ఆధారం తీసివేయబోతున్నాడు.
2శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు,
3సోదెగాళ్ళు, పెద్దలు, పంచ దశాధిపతులు,
4“నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను.
5ప్రజల్లో ఒకడు మరొకణ్ణి అణిచివేస్తారు.
6ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుణ్ణి పట్టుకుని,
7అతడు ఆ రోజున కేక వేసి,
8తన మాటలు, చేతలు యెహోవాకు విరుద్ధంగా ఉన్నాయి గనుక యెరూషలేము పాడైపోయింది,
9వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది.
10నీకు మేలు కలుగుతుందని నీతిమంతుడితో చెప్పు.
11దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది.
12చిన్న పిల్లలు నా ప్రజలను హింసిస్తారు.
13తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు.
14యెహోవా తన ప్రజల పెద్దల మీద,
15నా ప్రజలను నలగ్గొట్టి, వాళ్ళ ముఖాలు మీరెందుకు నేల రాస్తున్నారు?”
16యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు పోగరుబోతులు.
17కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల తలల మీద గజ్జి పుండ్లు పుట్టిస్తాడు.
18ఆ రోజున ప్రభువు వాళ్ళ కాళ్ళ గజ్జెలు, శిరోభూషణాలూ, చంద్రవంక నాగరాలూ,
19చెవిపోగులూ, కడియాలూ, మేలి ముసుగులూ,
20తలకు కట్టుకునే పాగాలూ, కాళ్ల గొలుసులూ, ఒడ్డాణాలూ,
21తాయెత్తులు, ఉంగరాలు, ముక్కు కమ్మలు,
22ఉత్సవ వస్త్రాలూ, ఉత్తరీయాలూ, పైటలూ, సంచులూ,
23చేతి అద్దాలు, సన్ననారతో నేసిన జలతారు ముసుగులు,
24అప్పుడు పరిమళ ద్రవ్యానికి బదులుగా దుర్గంధం,
25మనుషులు కత్తివాత కూలి పోతారు.
26యెరూషలేము గుమ్మాలు శోకించి దుఃఖిస్తాయి. ఆమె ఒంటరిదై నేల మీద కూర్చుంటుంది.