1ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న పూలమాలకు28:1 పూలమాలకు కిరీటం బాధ. వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యానికి బాధ.
2వినండి! శక్తిశాలీ, బలశాలీ అయిన ఒకడు ప్రభువుకి ఉన్నాడు. అతడు వడగళ్ళ లాంటి వాడు.
3ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న కిరీటాన్ని కింద పడేసి కాళ్ళతో తొక్కుతారు.
4పచ్చని లోయ తలపై ఉన్న వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యం
5ఆ రోజున సేనల ప్రభువైన యెహోవా మిగిలి ఉన్న తన ప్రజలకు తానే అందమైన కిరీటంగానూ, అందమైన రాజ మకుటంగానూ ఉంటాడు.
6ఆయన న్యాయం చెప్పడానికి న్యాయపీఠం పైన కూర్చున్న వాడికి న్యాయం నేర్పే ఆత్మగానూ, తమ ద్వారాల దగ్గర శత్రువులను తరిమి కొట్టే వాళ్లకి బలంగానూ ఉంటాడు.
7అయితే వీళ్ళు కూడా ద్రాక్షారసం తాగి తూలుతారు. మద్యపానం చేసి తడబడతారు.
8వాళ్ళు భోజనం చేసే బల్లలు అన్నీ వాంతితో నిండి ఉన్నాయి. శుభ్రమైన స్థలం అక్కడ కనిపించదు.
9వాడు జ్ఞానాన్ని ఎవరికి బోధిస్తాడు? వర్తమానాన్ని ఎవరికి వివరిస్తాడు? పాలు విడిచిన వాళ్ళకా? లేక తల్లి రొమ్ము విడిచిన వాళ్ళకా?
10ఎందుకంటే “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రంగా, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెంగా ఉంటుంది.” అని వాళ్ళు అనుకుంటారు.
11అప్పుడు ఆయన నిజంగానే వాళ్ళతో వెక్కిరించే పెదాలతో, విదేశీ భాషలో మాట్లాడతాడు.
12గతంలో ఆయన వాళ్ళతో “ఇది విశ్రాంతి స్థలం. అలసి పోయిన వాళ్ళని విశ్రాంతి తీసుకోనివ్వండి” అన్నాడు. కానీ వాళ్ళు వినలేదు.
13“ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రం,
14కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళూ, యెరూషలేములో ఈ ప్రజలను పాలించే వాళ్ళు, యెహోవా మాట వినండి.
15మీరు ఇలా అన్నారు “మేం చావుతో నిబంధన చేసుకున్నాం. పాతాళంతో ఒక ఒప్పందానికి వచ్చాం. కాబట్టి కీడు ప్రవాహంలా వచ్చినా అది మమ్మల్ని తాకదు. ఎందుకంటే మేం అబద్ధాన్ని ఆశ్రయించాం. మిథ్య వెనుక దాక్కున్నాం.”
16దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు.
17నేను న్యాయాన్ని కొలబద్దగానూ, నీతిని ఒడంబంగానూ చేస్తాను. వడగళ్ళు మీ అబద్దాలనే ఆశ్రయాన్ని తుడిచి పెట్టేస్తాయి.
18చావుతో మీరు చేసుకున్న నిబంధనను రద్దు చేస్తాను. పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం చెల్లదు.
19అవి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ముంచెత్తి వేస్తాయి.
20పడుకుని కాళ్ళు చాపుకోడానికి మంచం పొడవు చాలదు. కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు.
21యెహోవా తన పనిని జరిగించడానికి, ఆశ్చర్యకరమైన తన పనిని చేయడానికి, విచిత్రమైన తన పనిని జరిగించడానికి
22కాబట్టి పరిహాసం చేయకండి. లేకుంటే మీ సంకెళ్ళు మరింతగా బిగుసుకుంటాయి.
23కాబట్టి మనస్సు పెట్టి నేను చెప్పేది వినండి. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి.
24రైతు విత్తడానికి ఎప్పుడూ పొలం దున్నుతూనే ఉంటాడా? ఎప్పుడూ పొలంలో మట్టి పెళ్లలను పగలగొడుతూ ఉంటాడా?
25అతడు నేలను చదును చేసిన తర్వాత సోపు గింజలు చల్లడా? జీలకర్ర చల్లడా?
26అతడి దేవుడే అతడికి ఆ క్రమాన్ని నేర్పించాడు. ఎలా చేయాలో జ్ఞానంతో అతనికి బోధించాడు.
27జీలకర్రను యంత్రంలో ఉంచి నూర్చారు. జీలకర్ర పై బండి చక్రాన్ని దొర్లించరు.
28మనుషులు రొట్టెల కోసం గోధుమలను నూర్చి పిండి చేస్తారు. కానీ అదేపనిగా గోధుమలను పిండి చేస్తూనే ఉండరు కదా!
29దీన్ని కూడా మనుషులకు సేనల ప్రభువైన యెహోవా నేర్పిస్తున్నాడు.