We Believe JesusFé, Esperança e Nova Vida

హెబ్రీ పత్రిక 1

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 2 →

1పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు.

2ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు.

3దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.

4దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు.

5ఎందుకంటే దేవుడు,

6అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమి పైకి తీసుకు వచ్చినప్పుడు,

7తన దూతల గూర్చి చెప్పినప్పుడు ఆయన,

8అయితే తన కుమారుణ్ణి గూర్చి ఇలా అన్నాడు.

9నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహ్యించుకున్నావు.

10ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు.

11అవి నాశనమై పోతాయి. కానీ నువ్వు కొనసాగుతావు.

12వాటిని అంగవస్త్రంలాగా చుట్టి వేస్తావు.

13“నేను నీ శత్రువులను నీ పాదాల కింద పీటగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో”

14ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా?

హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 2 →