1యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.
2యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి.
3రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి,
4పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు.
5షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు.
6నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు.
7వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది.
8యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు.
9యూదా సింహం పిల్ల.
10షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు.
11ద్రాక్షావల్లికి తన గాడిదనూ,
12అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా,
13జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు.
14ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.
15అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు.
16దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా
17దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి,
18యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.
19దోపిడీ గాళ్ళు గాదును కొడతారు.
20ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది.
21నఫ్తాలి వదిలిపెట్టిన లేడి.
22యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ.
23విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు.
24అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది.
25నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన,
26నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా,
27బెన్యామీను ఆకలిగొన్న తోడేలు.
28ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.
29తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. “నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను.
30హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు.
31అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.
32ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు” అన్నాడు.
33యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు.