1యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చింది. ఆయన నాకు ఇలా చెప్పాడు.
2“నరపుత్రుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశానికిలా ప్రకటిస్తున్నాడు.
3ఇప్పుడు అంతం మీ పైకి వచ్చింది.
4నా దృష్టిలో మీ పట్ల ఎలాంటి కనికరమూ చూపను.
5ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు.
6అంతం వచ్చేస్తూ ఉంది.
7దేశవాసులారా, మీ నాశనం మిమ్మల్ని సమీపిస్తుంది.
8త్వరలోనే నా క్రోధాన్ని మీమీద కుమ్మరించబోతున్నాను.
9నాకు మీ పట్ల కనికరం లేదు.
10చూడండి! ఆ రోజు వచ్చేస్తుంది. నాశనం బయలు దేరింది.
11బలాత్కారం ప్రారంభం అయి దుర్మార్గులను శిక్షించే దండం అయింది.
12ఆ సమయం వచ్చేస్తుంది. ఆ రోజు దగ్గర పడింది.
13అమ్మినవాడు వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం తాను అమ్మిన భూమికి తిరిగి రాడు.
14వాళ్ళు సర్వసన్నద్ధులై బాకా ఊదారు.
15ఖడ్గం బయట ఉంది. లోపలేమో కరవూ, తెగులూ ఉన్నాయి.
16అయితే వాళ్ళలో కొంతమంది తప్పించుకుని పర్వతాల పైకి పారిపోతారు.
17వాళ్ళందరి చేతులూ తడబడతాయి. మోకాళ్ళు నీళ్ళలా బలహీనం అవుతాయి.
18వారు గోనెపట్ట ధరిస్తారు. తీవ్రమైన భయం వాళ్ళని కమ్ముకుంటుంది.
19వాళ్ళు తమ దగ్గర ఉన్న వెండిని వీధుల్లో పారేస్తారు.
20వాళ్ళు అహంకరించి రత్నభరితమైన ఆభరణాలు చేయించారు.
21వాటిని ఇతర దేశస్తుల చేతికి అప్పగిస్తాను.
22వాళ్ళు నా ఖజానాను అపవిత్రం చేస్తుంటే చూడకుండా నా ముఖం తిప్పుకుంటాను.
23తీర్పుని బట్టి దేశం రక్తంతోనూ, పట్టణం హింసతోనూ నిండిపోయింది. అందుకే సంకెళ్ళు సిద్ధం చేయండి.
24జాతుల్లోకెల్లా అత్యంత దుర్మార్గమైన జాతిని నేను పంపుతాను. వాళ్ళు వచ్చి ఇళ్ళను స్వాధీనం చేసుకుంటారు.
25భయం కలుగుతుంది! వాళ్ళు శాంతిని వాంచిస్తారు కానీ అది వారికి దొరకదు.
26నాశనం తరువాత నాశనం కలుగుతుంది.
27రాజు విచారంగా ఉంటాడు. యువరాజు నిస్పృహలో సామాన్య వస్త్రాలు ధరిస్తాడు.